vani viswanath: అన్ని విషయాలు చంద్రబాబే చూసుకుంటారు: వాణీవిశ్వనాథ్

  • చంద్రబాబు అంటే నాకు చాలా అభిమానం
  • రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది
  • తెలుగు ప్రజలపై అభిమానంతోనే ఇక్కడకు వచ్చా

తాను రాజకీయాల్లోకి వచ్చినా, రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని ప్రముఖ సినీ నటి వాణీవిశ్వనాథ్ తెలిపారు. చంద్రబాబు ఒక గొప్ప నాయకుడని... ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే, టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎన్.బీ.కే (నందమూరి బాలకృష్ణ) హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఆమె తరలి వచ్చారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో ఎలాంటి పాత్రను పోషించాలి? ఎక్కడ నుంచి పోటీ చేయాలి? అనే విషయాలను చంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు. చిన్న వయసు నుంచే తనకు రాజకీయాలు అంటే ఇష్టమని... పాలిటిక్స్ లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉందని ఆమె అన్నారు. తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే తాను ఏపీకి వచ్చానని... అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని తాను మర్చిపోలేనని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News