rishi kapoor: అవును, పీవోకే పాకిస్థాన్ దే!: నటుడు రిషి కపూర్ సంచలన వ్యాఖ్యలు

  • పీవోకే పాక్ ది.. జమ్ముకశ్మీర్ మనది
  • పాక్ వెళ్లాలని ఉంది
  • మా పిల్లలు తమ మూలాలను చూడాలి

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. కశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నట్టుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. జమ్ముకశ్మీర్ మనది. పీవోకే వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోని వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ రిషి కపూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News