harbhajan sing: దుమారం రేపిన హర్భజన్ సింగ్ ట్వీట్.. డిలీట్ చేసిన భజ్జీ

  • జింబాబ్వేతో ఘోరంగా ఓడిపోయింది
  • దారుణ స్థితిలో శ్రీలంక టీమ్
  • మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నా

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ శ్రీలంక క్రికెట్ టీమ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ దుమారం రేపింది. జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో శ్రీలంక ఘోరంగా ఓడిపోయిందని... తొలి ఇన్నింగ్స్ లో 200, రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిందని ట్వీట్ చేశాడు.

తన కెరియర్ లోనే అట్టడుగు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు. త్వరలోనే వారు కోలుకుంటారని... మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన ట్వీట్ ను భజ్జీ డిలీట్ చేశాడు.
.

harbhajan sing
team india
sri lanka cricket
  • Loading...

More Telugu News