Irrfan Khan: నేనేమైనా సచిన్‌నా?.. సెంచరీ కొట్టడానికి: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్

  • రూ.వంద కోట్ల వసూళ్లు సాధించిన ఇర్ఫాన్ తాజా సినిమా
  • నంబర్ గేమ్స్‌పై తనకు  నమ్మకం లేదన్న బాలీవుడ్ హీరో
  • తానో సాధారణ నటుడినేనని వ్యాఖ్య

బాలీవుడ్ నంబర్ గేమ్స్‌పై ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందించాడు. నంబర్లపై తనకు నమ్మకం లేదన్న ఇర్ఫాన్ మాట్లాడుతూ.. సెంచరీ కొట్టడానికి తానేమీ సచిన్ టెండూల్కర్‌ను కాదన్నాడు. ఇర్ఫాన్ నటించిన ‘హిందీ మీడియం’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. వంద కోట్ల వసూళ్లు సాధించింది.

ఈ సందర్బంగా బాలీవుడ్‌లో నంబరు గేమ్‌పై ఇర్ఫాన్ మాట్లాడుతూ.. తాను అందులో పడి కొట్టుకుపోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. ‘‘సెంచరీ కొట్టడానికి నేనేమీ సచిన్ టెండూల్కర్‌ను కాను’’ అని స్పష్టం చేశాడు. తానో సాధారణ నటుడిని మాత్రమేనని, తానెప్పుడూ అలాగే అనుకుంటానని పేర్కొన్నాడు. బిజినెస్ విషయాల్లో తాను జోక్యం చేసుకోబోనన్నాడు. తానెవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేశాడు.

నంబరు గేమ్ తనకు సరిపోలదని, ప్రతి ఒక్కరు తమకేమి సూటవుతుందో దానినే అనుసరించాలని సూచించాడు. ఇర్ఫాన్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు తనూజ చంద్ర దర్శకత్వం వహించగా పార్వతీ నాయికగా నటించింది. తన స్వభావానికి చాలా దగ్గరగా ఉన్నందునే ఈ సినిమాను అంగీకరించినట్టు ఇర్ఫాన్ వివరించాడు.

  • Loading...

More Telugu News