Posani Krishna Murali: ఈ రోజు ఇలా అంటున్నవారు.. ఆ రోజు కనీసం నేనెక్కడున్నానో కూడా పట్టించుకోలేదు!: పోసాని కృష్ణమురళి

  • నిండా అప్పుల్లో మునిగినప్పుడు ఇప్పుడు విమర్శించే వారు ఎక్కడున్నారు?
  • ఆస్తులు అమ్ముకున్నాను.. అప్పులు చేశాను 
  • తెలుగు సినీ పరిశ్రమ నాకు తరగని సంపద ఇచ్చింది

సినిమా షూటింగ్ కోసం పోసాని కృష్ణమురళి ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటాడంటూ ఫిల్మ్ నగర్లో ఓ టాక్ వుంది. దీని గురించి ఆయన మాట్లాడుతూ, 'అవును నిజమే...పోసాని కృష్ణమురళి సినిమాలు తీసి చేతులు కాల్చుకుని నిండా అప్పుల్లో మునిగిపోయినప్పుడు వీరంతా ఏమయ్యారని ప్రశ్నించారు.

ఆస్తులు అమ్ముకుని కష్టాలపాలైనప్పుడు వీరెందుకు మాట్లాడలేదని అడిగాడు. అప్పుడు స్పందించని వీరంతా ఇప్పుడు మాత్రం పోసాని కృష్ణమురళి 'ఇంత' డబ్బు తీసుకుంటాడనడం సరికాదని పేర్కొన్నాడు. ఒకప్పుడు ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా, అప్పులు కూడా చేశానని, ఇప్పుడు అవన్నీ తీర్చేశానని అన్నాడు. పని చెయ్యకపోయినా కూర్చుని తినేంత ఆస్తిని తెలుగు చిత్రపరిశ్రమ తనకు ఇచ్చిందని పోసాని తెలిపాడు. ఇందుకు తెలుగు చిత్రపరిశ్రమకు తాను రుణపడి ఉంటానని చెప్పాడు. 

Posani Krishna Murali
comments
  • Loading...

More Telugu News