ys jagan: చంద్రబాబు, జగన్ ల మధ్య రహస్య ఎజెండా ఉంది: రఘువీరా

  • ప్రజా సమస్యలను గాలికొదిలేశారు
  • మోదీ మెప్పు కోసం తపిస్తున్నారు
  • వైసీపీ అసెంబ్లీని బహిష్కరించడం దారుణం

ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు ఇద్దరూ ప్రజా సమస్యలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రహస్య ఎజెండా అమలవుతోందని అన్నారు. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే అర్థం కావటం లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని... రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

ys jagan
Chandrababu
raghuveera reddy
YSRCP
Telugudesam
congress
  • Loading...

More Telugu News