ys jagan: జగన్ వల్ల వచ్చిన మచ్చను పోగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు: సోమిరెడ్డి

  • జగన్ కారణంగా ఏపీని అవినీతి రాష్ట్రం అంటున్నారు
  • బాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి
  • జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆస్తులు మాత్రమే పెరుగుతాయి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయని... అదే జగన్ సీఎం అయితే ఆయన ఆస్తులు మాత్రమే పెరుగుతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్యారడైజ్ పేపర్లలో వెల్లడైన నల్లకుబేరుల జాబితాలో జగన్ పేరు కూడా ఉందని మంత్రి గుర్తు చేశారు.

కేవలం జగన్ కారణంగానే విదేశాల్లో ఏపీని అవినీతి రాష్ట్రమని అంటున్నారని మండిపడ్డారు. జగన్ వల్ల మన రాష్ట్రానికి వచ్చిన అవినీతి మచ్చను పోగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు జగన్ కలలు కంటున్నారని... ఆయనను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. 

ys jagan
Chandrababu
somireddy chandra mohan reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News