Kajal Agarwal: పెళ్లి చేసుకోమంటూ అమ్మానాన్నలు తొందర పెడుతున్నారు: కాజల్

  • తన పెళ్లిపై స్పందించిన కాజల్
  • మరికొన్ని సినిమాలు చేసిన తర్వాత.. అమ్మానాన్నల కోరిక తీరుస్తా
  • 2013లోనే పెళ్లి చేసుకున్న కాజల్ సోదరి నిషా అగర్వాల్

సినీ నటి కాజల్ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో, పెళ్లి ఎప్పుడు? అంటూ ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన కాజల్... త్వరగా పెళ్లి చేసుకోమంటూ అమ్మానాన్నలు కూడా తనను తొందరపెడుతూనే ఉన్నారని చెప్పింది. మరికొన్ని సినిమాల్లో నటించిన తర్వాత అమ్మానాన్నల కోరిక తీరుస్తానని తెలిపింది. మరోవైపు, కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మధ్యలోనే సినిమాలకు గుడ్ బై చెప్పిన నిషా... 2013లో పెళ్లి చేసుకుంది.

Kajal Agarwal
kaja agarwal marriage
nisha agarwal
tollywood
  • Loading...

More Telugu News