rajanikanth: కమలహాసన్ దారిలోనే... డిసెంబర్ 12న రాజకీయ పార్టీని ప్రకటించనున్న రజనీకాంత్!

  • ఇటీవల రాజకీయ ప్రకటన చేసిన కమల్  
  • తన పుట్టినరోజున ప్రకటన చేయనున్న రజనీకాంత్
  • ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవంటున్న సన్నిహితులు
  • సొంత పార్టీవైపే రజనీ మొగ్గు

తన పుట్టిన రోజైన డిసెంబర్ 12న కొత్త రాజకీయ పార్టీని రజనీకాంత్ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన చిరకాల మిత్రుడు కమలహాసన్ ఇటీవలే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి రజనీ కాంత్ వామపక్ష పార్టీల్లో చేరేందుకు గానీ, మరే ఇతర పార్టీలతో చేతులు కలిపేందుకు గానీ ఎంతమాత్రమూ సానుకూలంగా లేరు. సొంతంగా పార్టీ పెట్టాలన్నదే ఆయన నిర్ణయం.

 ఈ సంవత్సరం ఆగస్టులో తన రాజకీయ ప్రవేశంపై తొలిసారిగా కొంత స్పష్టతను ఇచ్చిన రజనీకాంత్, అభిమానులతో వరుసగా సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ రాజకీయ పార్టీని పెడితే, ఆయనతో చేతులు కలిపేందుకు తనకు అభ్యంతరం లేదని కమల్ ప్రకటించారు కూడా.

 

rajanikanth
Kamal Haasan
politics
  • Loading...

More Telugu News