ketireddy: 'లక్ష్మీస్ వీరగ్రంథం'పై కేతిరెడ్డికి అన్నగారి ఆత్మ ఇస్తున్న సందేశమిది... వర్మ సెటైరికల్ వీడియో!

  • లక్ష్మీ పార్వతి మహాసాధ్వి, గొప్ప ఇల్లాలు
  • నేను చెప్పాను... మీకు సహకరిస్తుంది
  • నా ఆత్మ మీ వెన్నంటి ఉంటుంది... మళ్లీ వస్తా
  • కేతిరెడ్డితో చెబుతున్న ఎన్టీఆర్ ఆత్మ

"మై డియర్ జగదీశ్వర్ రెడ్డిగారూ, మీరు తీయబోయే సినిమా కథాంశం మాకు అద్భుతంగా నచ్చింది. శ్రీమతి లక్ష్మీపార్వతికి నేను చెప్పాను. ఆమె మహాసాధ్వి. గొప్ప ఇల్లాలు. ఈ సినిమా విషయంలో ఆమె మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీరు ముందుకు వెళ్లండి. చరిత్ర తిరగరాయండి.

హహహ... మై డియర్ జగదీశ్వర్ రెడ్డిగారూ... నా ఆత్మ మీ వెన్నంటే ఉంటుంది. గో ఎహెడ్. నేను మళ్లీ వస్తా. నా సందేశాన్ని మళ్లీ వినిపిస్తా" అని ఎన్టీఆర్ ఆత్మ కేతిరెడ్డితో చెబుతున్నట్టు రాంగోపాల్ వర్మ తయారు చేసి యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను నేటి ఉదయం విడుదల చేయగా, ఇప్పటికే వేలాది మంచి దీన్ని వీక్షించారు. 'అన్నగారి ఆత్మ సందేశం' అన్న పేరిట హల్ చల్ చేస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.

ketireddy
ramgopal varma
lakshmi parvati
  • Error fetching data: Network response was not ok

More Telugu News