harassment: ఫొటోగ్రాఫర్లే లైంగికంగా వేధించారు: అంతర్జాతీయ మోడల్ సంచలన ప్రకటన

  • మోడలింగ్ రంగంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయన్న అంతర్జాతీయ మోడల్
  • తనకూ ఎదురయ్యాయన్న ప్రముఖ మోడల్ డ్రూ క్యాథరిన్
  • ఫొటోగ్రాఫర్లే లైంగిక వేధింపులకు పాల్పడతారన్న డ్రూ క్యాథరీన్

అంతర్జాతీయంగా లైంగిక వేధింపులపై మహిళలు గొంతెత్తుతున్న సంగతి తెలిసిందే. పలువురు హాలీవుడ్ నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా సోషల్ మీడియా మాధ్యమంగా బయటపెట్టి, నిందితులను వెలుగులోకి తెచ్చి నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మోడల్స్.. తమపై ఫొటోగ్రాఫర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రకటించి కలకలం రేపారు.

ఒంటారియో ప్రముఖ మోడల్, అందాల సుందరి డ్రూ క్యాథరిన్ తన కెరీర్ లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పింది. తాను మోడలింగ్ చేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు తనను లైంగికంగా వేధించారని ఆమె తెలిపింది. కేవలం తననే కాదని, చాలా మంది మోడల్స్ లైంగిక వేధింపులబారిన పడ్డారని ఆమె వెల్లడించింది. ఫొటోషూట్ లకు వెళ్లినప్పుడు ఈ వేధింపులు ఎదురవుతాయని ఆమె తెలిపింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రాంలో తన లేటెస్ట్ ఫొటోలను ఆమె పోస్టు చేసింది.

harassment
harassment in modeling
model
drew catherine
  • Loading...

More Telugu News