himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు: పెళ్లిదుస్తుల్లోనే ఓటు వేయడానికి వచ్చిన పెళ్లికొడుకు!
- హిమాచల్ ప్రదేశ్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు
- మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్న 54.9 శాతం ఓటర్లు
- ఓ వైపు పెళ్లి పెట్టుకుని ఓటు వేయడానికి వచ్చి ఆదర్శంగా నిలిచిన యువకుడు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 54.9 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓట్లు వేయడానికి ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఆ రాష్ట్రంలోని మనాలీలోని బాషింగ్ గ్రామంలో ఓ యువకుడు ఓ వైపు పెళ్లి పెట్టుకుని పెళ్లి దుస్తులతోనే ఓటు వేయడానికి వచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఆ పెళ్లికొడుకుతో ఫొటోలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. ఓటు వేసిన అనంతరం ఆ యువకుడు పెళ్లి పందిరి వద్దకు తిరిగి బయలుదేరాడు.
Right before his wedding, a bridegroom casts his vote at a polling booth in Manali's Baashing village #HimachalPradeshElections pic.twitter.com/a2zYx0jQCk
— ANI (@ANI) November 9, 2017