MS Dhoni: అత్యంత నిజాయతీ గల క్రికెటర్లలో ధోనీ ఒకడు: నెహ్రా

  • ఒక మ్యాచ్ లో ఆడకపోతే విమర్శిస్తారా
  • 2020 వరకు ధోనీ ఆడతాడు
  • అతని ఆటను అతడిని ఆడనివ్వండి

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ధోనీ ఆటతీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోనీకి మద్దతుగా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా నిలిచాడు. ధోనీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పాడు. ఒక మ్యాచ్ లో ఆడనంత మాత్రాన విమర్శిస్తారా? అని ప్రశ్నించాడు. అతని ఆటను అతడిని ఆడనివ్వాలని సూచించాడు.

అత్యంత నిజాయతీ గల క్రికెటర్లలో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. 2020 వరల్డ్ టీ20 వరకు భారత జట్టులో ధోనీ కొనసాగుతాడనే నమ్మకం తనకుందని చెప్పాడు. ఒక ఫాస్ట్ బౌలర్ గా 39 ఏళ్ల వయసు వరకు తాను ఆడానని... ధోనీ ఫిట్ నెస్ చూస్తే కనీసం మరో మూడేళ్లయినా ఇండియాకు ఆడతాడని తెలిపాడు. సరైన సమయంలో కెప్టెన్సీని కోహ్లీకి అప్పజెప్పిన ధోనీకి, ఆట నుంచి ఎప్పుడు రిటైర్ కావాలో తెలియదా? అని ప్రశ్నించాడు.

MS Dhoni
Ashish Nehra
team india
t20
  • Loading...

More Telugu News