saudi arabia: సౌదీ యువరాజు చనిపోయాడంటూ వార్తలు.. వాస్తవం కాదన్న ప్రభుత్వం!

  • యువరాజు అబ్దుల్ అజీజ్ చనిపోయాడంటూ వార్తలు
  • అదంతా అవాస్తవమేనన్న సౌదీ
  • నిక్షేపంగా ఉన్నాడంటూ వెల్లడి

సౌదీ అరేబియాలో అనేక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న 11 మంది యువరాజులతో సహా మంత్రులు, మాజీ మంత్రులు, అధికారులను అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యువరాజుల్లో ఒకరైన మన్సూర్ బిన్ మోక్రెన్ మృతి చెందాడు. అనంతరం మరో యువరాజు అబ్దుల్ అజీజ్ ఫహద్ (44)పై కొందరు కాల్పులు జరపగా యువరాజు చనిపోయాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను  సౌదీ ఖండించింది. ఫహద్ నిక్షేపంగా ఉన్నాడని ఫ్రాన్స్ మీడియాకు ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. గతంలో సౌదీని పాలించిన కింగ్ ఫహద్ కుమారుడే అబ్దుల్ ఫహద్. కాల్పుల్లో ఫహద్ మరణించినట్టు స్థానిక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

  • Loading...

More Telugu News