sandeep reddy vanga: అప్పుడు మాత్రం నాకు కొంచెం భయం వేసింది : 'అర్జున్ రెడ్డి' దర్శకుడు
- నేను ఒక ఫ్రేమ్ పెడితే అది అలాగే ఉండాలి
- అందుకే అంతా రియల్ గా చూస్తున్నట్లుందని అన్నారు
- పోస్టర్స్ చింపారు .. డ్రగ్స్ ప్రస్తావన తెచ్చారు
తెలుగులో యూత్ కి సంబంధించిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. యూత్ కి ఒక రేంజ్ లో ఈ కంటెంట్ కనెక్ట్ అయింది. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను వసూళ్ల వర్షం కురిసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఈ సినిమా గురించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు.
" నేను ఒక ఫ్రేమ్ పెడితే అది ఏ మాత్రం అటు ఇటైనా ఒప్పుకోను. ఈ ఫ్రేమ్ ఇలా వుండాలని నేను అంటే అది అలాగే ఉండాలి .. అంతే. అందువల్లనే ఈ సినిమా చూస్తుంటే, రియల్ గా జరుగుతున్నది చూస్తున్నట్టుగా వుందని చాలా మంది చెప్పారు. కెమెరా కూడా ఒక పాత్రలా .. మిగతా పాత్రలను ఫాలో అయ్యేలా చేయడం వల్లనే ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఈ సినిమా పోస్టర్ చింపడం .. డ్రగ్స్ ప్రస్తావన .. మహిళా మండలి గొడవలు మొదలయ్యాయో అప్పుడు కొంచెం భయమైంది. అందరి కాన్సెన్ట్రేషన్ అంతా ఆ వైపు పోయి, కంటెంట్ ను ఎవరూ పట్టించుకోరా? .. మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుందా? అని ఒక రోజంతా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.