rahul: మోదీ మోదీ... అంటూ రాహుల్ కు సూరత్ వ్యాపారుల స్వాగతం... వీడియో చూడండి!

  • ఎన్నికల ప్రచారం కోసం సూరత్ కు వెళ్లిన రాహుల్
  • రాహుల్ ను చూసి మోదీ పేరు జపించిన వ్యాపారులు
  • పట్టించుకోకుండా వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత

గుజరాత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం సూరత్ కు వెళ్లిన రాహుల్ గాంధీకి అక్కడి వస్త్ర వ్యాపారుల నుంచి వినూత్న నిరసన ఎదురైంది. ప్రభుత్వం తీసుకువచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల కారణంగా సూరత్ వ్యాపారులు ఎక్కువగా నష్టపోయారని రాహుల్ ఇటీవలి కాలంలో పలు మార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇక వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో, ప్రచారం నిమిత్తం ఓ టెక్స్ టైల్ మార్కెట్ కు రాహుల్ వచ్చిన వేళ, అక్కడి వ్యాపారులు, "మోదీ మోదీ..." అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ అక్కడికి వచ్చిన తరువాతే వారు నినదించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ నినాదాలను పట్టించుకోని రాహుల్, జీఎస్టీతో సూరత్ వ్యాపారుల కాళ్లను మోదీ విరిచేశారని, ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదని, భారతావని భవిష్యత్తు కోసమని అన్నారు. గుజరాత్ వ్యాపారుల 'మోదీ' నినాదాలను కొందరు ఔత్సాహికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిల్లో ఓ వీడియోను మీరూ చూడవచ్చు.

rahul
Gujarath
elections
surat
  • Error fetching data: Network response was not ok

More Telugu News