imax manager venkat prasad: యువతిని మోసం చేసిన కేసులో.. 'బాహుబలి' పెంపుడు తండ్రి 'ఐమ్యాక్స్' వెంకట్ అరెస్టు!

  • 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ ను పెంచుకునే కోయ తండ్రిగా నటించిన 'ఐమ్యాక్స్' వెంకట్
  • 'గరుడవేగ' సినిమాలో సీఎం పీఏగా వేషం 
  •  ఏడేళ్లుగా సహజీవనం చేసి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు.. అరెస్టు 

యువతిని మోసం చేసిన కేసులో 'ఐమ్యాక్స్' ధియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ భర్తతో మనస్పర్ధలు రావడంతో ఆమె విడిగా ఉంటోంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా ఐమ్యాక్స్‌లో పనిచేసే మేనేజర్‌ వెంకటప్రసాద్‌ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి సన్నిహితమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.

ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు. 'బాహుబలి'లో ప్రభాస్ కు పెంపుడు తండ్రిగా నటించాడు. అలాగే తాజాగా విజయం సాధించిన 'గురుడవేగ'లో సీఎం పిఏగా కూడా నటించాడు.

ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఆరాతీయగా, అతను మరో యువతితో తిరుగుతున్నట్టు తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె... తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో విచారణకు దిగిన పోలీసులు తమ దర్యాప్తులో అతను చాలా మంది యువతులను మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో 420, 506,509, 354(డి) కింద కేసులు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News