red sandal queen: చిత్తూరు కోర్టుకు భర్తతో కలసి వచ్చిన రెడ్ శాండల్ క్వీన్ సంగీత చటర్జీ... చూడండి!

  • ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న సంగీత చటర్జీ
  • కోర్టుకు వచ్చి న్యాయవాదితో చర్చలు
  • గత సంవత్సరం కోల్ కతాలో అరెస్టయిన శాండల్ క్వీన్

శేషాచలం అడవుల్లో రెడ్ శాండల్ స్మగ్లింగ్ కేసులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, ఆపై దొరికిపోయి, జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న శాండల్ క్వీన్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ, తన భర్త లక్ష్మణ్ తో కలసి చిత్తూరు కోర్టుకు వచ్చింది. కేసు విచారణ నిమిత్తం వచ్చిన ఆమె కాసేపు కోర్టు ఆవరణలో గడిపింది. కేసులకు సంబంధించి తన న్యాయవాదితో మాట్లాడింది.

కాగా, గత సంవత్సరం మేలో సంగీతను కోల్ కతాలో చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఆపై ఆమె జైలులో ఆత్మహత్యాయత్నం చేయడం, కొద్ది నెలల తరువాత బెయిలు లభించడం తెలిసిందే. అప్పటికే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న లక్ష్మణ్ కు సైతం బెయిల్ రాగా, ప్రస్తుతం ఈ జంట కోర్టు కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది.

red sandal queen
sangeeta chatarjee
chittore court
  • Loading...

More Telugu News