nayanatara: ఇటు అనుష్క .. అటు నయనతార .. ఇద్దరిలో ఎవరు మెప్పిస్తారో?

  • 'ఆరమ్' సినిమాతో నయనతార 
  • 'భాగమతి'గా కనిపించనున్న అనుష్క 
  • ఇద్దరు పోషించినవీ కలెక్టర్ పాత్రలే 
  • అందరిలోను ఆసక్తి      

తమిళంలో నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను అక్కడి ప్రజలు ఆమెకి నీరాజనాలు పడుతుంటారు. అలాంటి నయనతార తమిళంలో 'ఆరమ్' సినిమా చేసింది. ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో అక్కడ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో నయనతార కలెక్టర్ పాత్రలో కనిపించనుంది.

ఈ పాత్రలో ఆమె అదరగొట్టేసిందనే టాక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే తెలుగులో ఈ సినిమా 'కర్తవ్యం' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాలో, అనుష్క కూడా కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోను సంక్రాంతికి విడుదల కానుంది. ఈ ఇద్దరు కథానాయికలలో ఎవరు ఎక్కువ మార్కులు కొట్టేస్తారో చూడాలి మరి.     

  • Loading...

More Telugu News