Donald Trump: ట్రంప్ కు ఎదురు దెబ్బ... వర్జీనియా స్టేట్ గవర్నర్ గా డెమొక్రాట్ విజయం!

  • ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • దక్షిణ కొరియాలో ఉండగా వర్జీనియా స్టేట్ గవర్నర్ ఎన్నికలు
  • రిపబ్లికన్ అభ్యర్థి గిలెస్పీపై విజయం సాధించిన డెమొక్రాట్ రాల్ఫ్ నార్తమ్

ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియా స్టేట్ గవర్నర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి లెఫ్టినెంట్ గవర్నర్ రాల్ఫ్ నార్తమ్ రిపబ్లికన్ అభ్యర్థి గెలస్పీపై ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిపబ్లికన్లు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలు ఫలించలేదు.

ట్రంప్ ప్రత్యక్ష ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయనకు మద్దతుగా ట్వీట్లు, రికార్డింగ్ సందేశాలు పంపారు. అయినప్పటికీ ఆయన కోరుకున్న ఫలితం మాత్రం రాలేదు. కాగా, ట్రంప్ కొనసాగిస్తున్న ఇమ్మిగ్రేషన్, గ్యాంగ్ క్రైమ్, స్వార్థపూరితమైన చర్యలనే ప్రచారంగా మార్చుకున్న నార్తమ్ విజయం సాధించడంతో ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలినట్టైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

Donald Trump
america
North Korea
virginia
virginia governer elections
  • Loading...

More Telugu News