Saina Nehwal: సింధును చిత్తు చేసిన సైనా నెహ్వాల్!

  • జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ సొంతం చేసుకున్న సైనా
  • టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సింధు
  • పురుషుల ఫైనల్స్ లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత ఏస్ షట్లర్ సింధు జైత్రయాత్రకు మరో హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ చెక్ పెట్టింది. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సైనా సత్తా చాటింది. ఫైనల్లో సింధును ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో ఇద్దరి మధ్య పోరు నువ్వా? నేనా? అనే విధంగా కొనసాగినప్పటికీ... చివరకు సైనా 21-17, 27-25 తేడాతో సింధును ఓడించింది. ఈ మ్యాచ్ లో సింధునే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగినప్పటికీ... చివరకు సైనానే జయభేరి మోగించింది. తద్వారా, తనలో సత్తా ఇంకా తగ్గలేదని చాటింది.

మరోవైపు, పురుషుల ఫైనల్స్ లో కిడాంబి శ్రీకాంత్ పై ప్రణోయ్ విజయం సాధించాడు. 21-15, 16-21, 21-7 తేడాతో శ్రీకాంత్ పై విజయభేరి మోగించాడు.

ఈ విజయం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా సైనా ట్వీట్ చేసింది. పురుషుల టైటిల్ ను గెలుచుకున్న ప్రణోయ్ కు శుభాకాంక్షలు తెలిపింది. 

Saina Nehwal
PV Sindhu
kidambi srikanth
national badminton championship
  • Error fetching data: Network response was not ok

More Telugu News