siddharth: హారర్ థ్రిల్లర్ ను సిద్ధార్థ్ మళ్లీ వాయిదా వేసేశాడు

  • సిద్ధార్థ్ హీరోగా 'గృహం' 
  • కథానాయికగా ఆండ్రియా 
  • 10వ తేదీన విడుదల కావడం లేదు
  • 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్     

కొంతకాలంగా సిద్ధార్థ్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తాజాగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అవళ్' సినిమాతో ఆయన నిరీక్షణ ఫలించింది. తమిళంలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాను ఈ నెల 3వ తేదీనే విడుదల చేయాలని సిద్ధార్థ్ భావించాడు.

 అయితే ఆ రోజున మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, థియేటర్స్ ఎక్కువగా దొరకవనే ఉద్దేశంతో నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఈ డేట్ కూడా వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాననీ, ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. తెలుగులోనూ ఈ సినిమా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News