manasuku nachchindi: నాన్న అభిమానులే సమాజం అనుకున్నా... తప్పని తెలిసేవరకు ఆలస్యమైపోయింది!: మంజుల

  • అడ్డంకులుగా మారిన కృష్ణ అభిమానులు
  • వారే సమాజమని భావించానని చెప్పుకున్న మంజుల
  • తన వైఫల్యానికి తానే కారణమని వెల్లడి
  • 'మనసుకు నచ్చింది' షార్ట్ ఫిల్మ్ లో మంజుల

తన పుట్టిన రోజునాడు 'మనసుకు నచ్చింది' అంటూ షార్ట్ ఫిల్మ్ ను తన జీవిత విశేషాలతో రూపొందించి విడుదల చేసిన మహేష్ బాబు సోదరి మంజుల, అందులో పలు కీలక విషయాలను వెల్లడించారు. తన కుటుంబ నేపథ్యం, తన తండ్రికున్న అభిమానులే తనకు అడ్డంకులుగా మారారని ఆమె వాపోయారు. తన తండ్రి అభిమానులే సమాజమని అనుకునేదాన్నని, అయితే అది తప్పని తెలుసుకునే సరికే ఆలస్యమైపోయిందని పేర్కొంది.

తన వైఫల్యానికి అసలు కారణం తానేనని, ఆపై మనసు మార్చుకుని కొత్త బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కొత్త శక్తి తన శరీరంలోకి ప్రవేశించిందని వెల్లడించింది. ప్రయాణం ముఖ్యమేకానీ, గమ్యం ముఖ్యం కాదని అభిప్రాయపడ్డ మంజుల, తనలోని ప్రతిభను గురించి స్వయంగా తెలుసుకున్న తరువాత ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని, మనసు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించానని, దాంతో విజయం సాధించానన్న అనందాన్ని పొందానని మంజుల తెలిపింది.

కాగా, 'కావ్యాస్ డైరీ', 'ఆరెంజ్' వంటి చిత్రాల్లో నటించిన మంజుల, మహేష్ నటించిన పోకిరి, నాని చిత్రాలకు, నాగచైతన్య, సమంతల తొలి చిత్రం 'ఏమాయ చేశావే'కు నిర్మాతగాను వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News