Uttar Pradesh: భర్త గుర్తుకు రావడంతో బిగ్గరగా ఏడుస్తూ నామినేషన్ వేసిన మహిళ!

  • బిగ్గరగా ఏడుస్తూ నామినేషన్ వేసిన దుర్గేష్ నందిని
  • 2015 నవంబర్ 1న ఆమె భర్తపై హత్యాయత్నం జరగగా, చికిత్స పొందుతూ 7న మృతి
  • భర్త గుర్తుకురావడంతో కన్నీరు మున్నీరైన దుర్గేష్ నందిని

లక్నో కార్పొరేషన్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి బిగ్గరగా ఏడుస్తూ నామినేషన్ వేయడంతో అధికారులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. దీంతో ఇంతకీ ఆమె అంతపెద్దగా ఏడవడానికి కారణమేంటని ఆరాతీయగా ఆమెకు భర్త గుర్తుకు వచ్చారని తేలింది.

సమాజ్‌వాది పార్టీ నుంచి లక్నో కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌ గా పోటీచేసేందుకు దుర్గేష్ నందిని నామినేషన్ దాఖలు చేశారు. అందుకుగాను లక్నోలోని హజ్రత్‌ గంజ్‌ లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తన మద్దతుదారులతో కలిసి ఆమె వచ్చింది. నామినేషన్ వేసిన సమయంలో బిగ్గరగా రోదిస్తూ ఆమె నామినేషన్ దాఖలు చేసింది. దీనిని గమనించిన మీడియా... 'సాధారణంగా నామినేషన్ వేసినప్పుడు ఎవరైనా నవ్వుతారు. మీరెందుకు ఏడుస్తున్నా'రని ఆమెను ప్రశ్నించింది.

దీనికి ‘ఈ రోజు నేను ఏమీ మాట్లాడలేను. కారణం మీ అందరికీ తెలుసు’ అంటూ ఆమె సమాధానం చెప్పారు. దీంతో సన్నిహితులను ఆరాతీయగా, 2015 నవంబరు 1న హత్యకు గురైన ఆమె భర్త, అప్పటి కౌన్సిలర్ బంటూ యాదవ్‌ ను దుండగులు కాల్చగా, చికిత్స పొందుతూ నవంబరు 7న ఆయన మృతి చెందారు. దీంతో అతని స్థానంలో ఆమెను మళ్లీ సమాజ్ వాదీ పార్టీ భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రభావోద్వేగానికి గురయ్యారు. 

  • Loading...

More Telugu News