ntr: ఒరిజినల్ ఎన్టీఆరే ఓడిపోయారు.. ఈ డూప్లికేట్ తారకరామారావు ఎంత?: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి

  • అక్రమంగా భూములను సేకరించారు
  • ఫార్మా సిటీని అడ్డుకుంటాం
  • టీఆర్ఎస్ లో చేరినవారు మళ్లీ పోటీ చేసి గెలవాలి

ప్రజల గుండెల్లో నిలిచి పోయిన ఒరిజినల్ ఎన్టీఆరే తమ నియోజకవర్గం కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారని... ఈ డూప్లికేట్ తారకరామారావు మా నియోజకవర్గ ప్రజలకు ఎంతని మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, కల్వకుర్తికి చెందిన కొందరు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారని... వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.

మీ తండ్రి కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారని... అవన్నీ ఏమయ్యాయో చెప్పాలంటూ కేటీఆర్ ను డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ పేరుతో మీరు, మీ కుటుంబసభ్యులు కొందరు అక్రమంగా భూములను లాక్కున్నారని... అందుకే తాము ఫార్మా సిటీని అడ్డుకుంటామని హెచ్చరించారు. తమరి నియోజకవర్గం సిరిసిల్లలో కూడా అక్రమంగా భూసేకరణ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ntr
KTR
vasichand reddy
kalwakurthy
TRS
congress
  • Loading...

More Telugu News