bank of china: భారత్ ను దెబ్బతీసేందుకు మరో అడుగు వేసిన చైనా, పాకిస్థాన్!

  • కరాచీలో బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ చైనా
  • ఇది మరపురాని ఘట్టమన్న పాక్ అధ్యక్షుడు
  • ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడతాయన్న హుస్సేన్

భారత్ ను దెబ్బతీయాలనే లక్ష్యంతో చైనా, పాకిస్థాన్ లు తమ బంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ను ఏర్పాటు చేసుకున్నాయి. పాక్ లోని మసూద్ అజార్ లాంటి ఉగ్రవాదులకు చైనా వంతపాడుతోంది. తాజాగా పాకిస్థాన్ లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది చైనా. బ్యాంక్ ఆఫ్ చైనా కరాచీలో తొలి బ్రాంచ్ ను ప్రారంభించింది.

చైనా లీడింగ్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ ఏర్పాటుతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని పాక్ ఈ సందర్భంగా పేర్కొంది. ఇది ఒక మరపురాని ఘట్టమని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ చైనా దక్షిణాసియాలోనే తొలిసారి తన బ్రాంచ్ ను పాక్ లో ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పటికే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా పాక్ లో రెండు బ్రాంచ్ లను ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News