pavan: పవన్ సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది!

  • షూటింగ్ దశలో 'అజ్ఞాతవాసి' 
  • రీసెంట్ గా 'బయటికొచ్చి చూస్తే' సాంగ్ రిలీజ్ 
  • మొదటి 8 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్
  • ఈ సాంగ్ కి లక్షకి పైగా లైక్స్  

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'అజ్ఞాతవాసి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పగా, అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. లిరికల్ వీడియో రూపంలో పలకరించిన ఈ సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది.

యూట్యూబ్ లో మొదటి 8 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ సాంగ్, ప్రస్తుతం ఒకటిన్నర మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. శ్రీమణి సాహిత్యం .. అనిరుధ్ సంగీతంతో ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటకి ఇంతవరకూ లక్షకి పైగా లైక్స్ రావడమే అందుకు నిదర్శనం. మొత్తానికి మొదటి పాటతోనే 'అజ్ఞాతవాసి' అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. డిసెంబర్లో ఆడియోను రిలీజ్ చేసి .. జనవరి 9న సినిమాను విడుదల చేయనున్నారు.  

  • Loading...

More Telugu News