singam basava punnaiay: ఏపీ కాంగ్రెస్ కురువృద్ధుడు సింగం బసవపున్నయ్య కన్నుమూత

  • ఆయన వయసు 91 సంవత్సరాలు
  • తెనాలి రాజకీయాల్లో తలపండిన నేత
  • 9వ లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు సింగం బసవపున్నయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

కృష్ణా జిల్లా మోడుముడి గ్రామంలో జన్మించిన ఆయన, న్యాయవాద వృత్తిని చేపట్టారు. తెనాలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై విజయం సాధించి 9వ లోక్ సభలో ఎంపీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, సినీ నటి శారదపై ఆయన ఓడిపోయారు. వయసు పెరిగిన కారణంగా చాలా కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బసవపున్నయ్య మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

singam basava punnaiay
congress
tenali
sarada
  • Loading...

More Telugu News