ayodhya: అయోధ్యలో వివాదాస్పద స్థలంపై రాజీ దిశగా మరో ముందడుగు!
- మీడియాతో మాట్లాడిన యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్
- రాజీ ముసాయిదా ప్రతిపాదనలను డిసెంబర్ 6లోగా రూపొందిస్తాం
- అయోధ్యకు వెళ్లి సన్యాసులు, మహంతులతో సమావేశం అవుతాం
అయోధ్యలో వివాదాస్పద స్థలంపై రాజీ దిశగా మరో ముందడుగు పడింది. ఈ రోజు మీడియాతో మాట్లాడిన యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ పలు కీలక విషయాలు తెలిపారు. రాజీ ముసాయిదా ప్రతిపాదనలను డిసెంబర్ 6లోగా రూపొందిస్తామని చెప్పారు. త్వరలో అయోధ్యకు వెళ్లి సన్యాసులు, మహంతులతో సమావేశం అవుతామని తెలిపారు. రాజీ ముసాయిదా ప్రతిపాదనలపై ఇప్పటికే పలువురితో చర్చించినట్లు చెప్పారు.
మసీదును అయోధ్యలో కాకుండా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ముస్లింల జనాభాకు ఇప్పటికే తగినన్ని మసీదులు కూడా ఉన్నాయని అన్నారు. కూలిపోయిన మసీదుపై ఓ నిర్ణయం తీసుకునే హక్కు తమకి మాత్రమే ఉందని, ఇతర ముస్లిం సంస్థలు జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబరు 6, 1992న బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే.