స్టాక్ మార్కెట్లు: భారీ నష్టాలను చవిచూసిన‌ స్టాక్ మార్కెట్లు!

  • ఈ రోజు ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్
  • ఆ త‌రువాత న‌ష్టాల బాట‌లో
  • 360 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 102 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తరువాత మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంది. ప్ర‌ధానంగా బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లు నష్టాల బాట పట్టడంతో సూచీ మరింత ప‌డిపోయింది. సెన్సెక్స్‌ 360 పాయింట్లు కోల్పోయి, 33,371 వద్ద ముగియ‌గా, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 10,350 వద్ద ముగిసింది. ఇక‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ‌ రూ. 65.03గా న‌మోదైంది.  

ఈ రోజు స్వ‌ల్ప‌ లాభాల‌తో ముగిసిన సంస్థ‌లు: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, టెక్‌మహింద్రా, టీసీఎస్.

న‌ష్టాల‌ను చ‌విచూసిన సంస్థ‌లు: గోవా, ఇండోర్‌లలోని లుపిన్‌ తయారీ కేంద్రాలు భారీగా న‌ష్ట‌పోగా, సిప్లా, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ షేర్లు ప‌డిపోయాయి.  

  • Loading...

More Telugu News