asia: ఆసియా మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఫైన‌ల్‌కి చేరుకున్న మేరీ కోమ్‌

  • జ‌పాన్‌కు చెందిన త్సుబాసా కొమురాను ఓడించిన భార‌త బాక్స‌ర్‌
  • ఐదో బంగారు ప‌త‌కానికి ఒక్క మ్యాచ్ దూరంలో మేరీ
  • 48 కేజీల విభాగంలో పాల్గొంటున్న మేరీ

వియ‌త్నాంలోని హోచిమన్ సిటీలో జ‌రుగుతున్న ఆసియా మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో భార‌త బాక్స‌ర్ మేరీ కోమ్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఆమె ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించి, త‌న ఖాతాలో ఐదో ఆసియా బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ బంగారు ప‌త‌కం కోసం వేట ప్రారంభించింది.  

48 కిలోల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్లో జ‌పాన్‌కు చెందిన త్సుబాసా కొమురాను 5-0 తేడాతో మేరీ ఓడించింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు సార్లు పసిడి, ఒక‌సారి రజతం కైవసం చేసుకున్న మేరీ, ఫైన‌ల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన జ‌ర్గలాన్ ఓచిర్‌బ‌ట్‌తో గానీ, డీపీఆర్ కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్ మితోగానీ తలపడనుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News