siddharth: విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'గృహం'

  • సిద్ధార్థ్ హీరోగా .. నిర్మాతగా రూపొందిన 'గృహం'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యం 
  • ఆండ్రియా కథానాయిక 
  • ఇక్కడ హిట్ కోసం సిద్ధార్థ్ వెయిటింగ్     

సిద్ధార్థ్ తన సొంత బ్యానర్ పై తనే కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ ను నిర్మించాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తనకి మంచి గుర్తింపు ఉండటం వలన, ఈ మూడు భాషల్లోను ఈ నెల 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశాడు. తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటం .. థియేటర్స్ దొరక్కపోవడం వలన ఇక్కడ విడుదలను ఆపేశాడు. కొన్ని కారణాల వలన హిందీలోను ఈ సినిమా ఆ రోజున విడుదలకి నోచుకోలేదు.  

తమిళంలో 'అవళ్' పేరుతో విడుదలైన ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బెస్ట్ హారర్ ఫిలిమ్స్ లో ఈ సినిమా కూడా ఒకటి' అంటూ అక్కడ రివ్యూలు వచ్చాయి. అలాంటి ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన తెలుగులో 'గృహం' పేరుతోను .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' పేరుతోను విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. ఇక ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి మరి.        

  • Error fetching data: Network response was not ok

More Telugu News