Salman Khan: 'అందరూ వేటాడుతారు.. కానీ, టైగర్ కంటే బాగా ఎవరైనా వేటాడగలరా?' అంటూ సల్మాన్ వచ్చేశాడు.. ట్రైలర్ చూడండి!

  • సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' ట్రైలర్ విడుదల
  • ట్రైలర్ లో సల్మాన్, కత్రినా కైఫ్ అదరగొట్టేశారంటున్న అభిమానులు
  • ట్రైలర్ లో డైలాగులకు అభిమానులు ఫిదా
  • మళ్లీ సల్మాన్ హవా ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు

'ఏక్ థా టైగర్' సినిమా బాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ట్యూబ్ లైట్' డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్ గా 'టైగర్ జిందా హై' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తోంది. ఇంతవరకు ఎవరూ సాహసించని సబ్జెక్ట్ ను దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ డీల్ చేశాడు. సల్మాన్ తరహా మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. సల్మాన్ కు ఎంతో అచ్చొచ్చిన భారత్-పాక్ సంబంధాన్ని కూడా ఇందులో చూపించాడు. సల్మాన్ తోపాటు అతని మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కూడా ఫైట్లు బాగా చేసింది. ట్రైలర్ లో డైలాగులు అదిరిపోయాయి.

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన కథ అని చెబుతూ, ట్రైలర్ ఇరాక్ లో ప్రారంభమవుతుంది. 'ప్రపంచంలోని ప్రతి చోటా విభజన ఉంటుంది, మంచీచెడులైనా, వెలుగు చీకటి అయినా విభజన సహజం' అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఇరాక్ లో భారత్ కు చెందిన 25 మంది నర్సులను టెర్రరిస్టులు కిడ్నాప్ చేయడంతో వారిని విడిపించేందుకు ఎవరున్నారని 'రా' వెతుకుతుంది. 'రా' ఆపీసర్ గిరీష్ కర్నార్డ్ 'టైగర్' ఒక్కడే తీసుకురాగలడని చెప్పడంతో సల్మాన్ ఎంట్రీ వస్తుంది. సల్మాన్ అభిమానులకు నచ్చేలా... 'అందరూ వేటాడుతారు...కానీ టైగర్ కంటే బాగా ఎవరైనా వేటాడగలరా?' అంటూ కనబడతాడు.

ఆ తరువాత 'ఐఎస్సీ' ('ఐఎస్ఐఎస్' తరహా) ఉగ్రవాద సంస్థ అధినేత అబు ఉస్మాన్‌... సల్మాన్ ను కిడ్నాప్‌ చేసి ‘చావడానికి సిద్ధమా.. ధైర్యముంటే ఆపు’ అని బెదిరిస్తున్నప్పుడు సల్మాన్‌ దీటుగా.. ‘ధైర్యముంటే ఆపడానికి ట్రై చేయ్‌’ అంటూ చెప్పడం అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. ఆ ట్రైలర్ చూడండి. కాగా ఇరాక్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంతర్యుద్ధం సమయంలో 25 మంది నర్సులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ పై సినిమా తీసే ధైర్యం ఇంతవరకు ఎవరూ చేయలేదు. కానీ అలాంటి డ్రెస్ కోడ్ లో టెర్రరిస్టులను చూపడం సాహసమేనని అభిమానులు పేర్కొంటున్నారు. 

Salman Khan
katrina khaif
tiger zinda hai
movie
trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News