japan: ప్రేమికులను, భర్తలను హత్యలు చేసిన 'బ్లాక్ విడో'కు మరణదండన
- మగవాళ్లను ఆకర్షించి శృంగారం జరిపే కాకేహి
- వాళ్లకు బీమా చేయించి చంపడం స్పెషల్
- బిలియన్ యన్ లతో సైనైడ్ కొనుగోలు
- సుదీర్ఘ విచారణ తరువాత తీర్పిచ్చిన జపాన్ కోర్టు
జపాన్ లో సంచలనం సృష్టించిన 'బ్లాక్ విడో' కేసులో ఈ ఉదయం కోర్టు తీర్పు వెలువడింది. తన భర్తను, ఇద్దరు ప్రియుళ్లను దారుణాతి దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన చిసాకో కాకేహి (70)కి మరణదండన విధిస్తూ, క్యోటో జిల్లా న్యాయస్థానం తీర్పిచ్చింది. మగవాళ్లను ఆకర్షించి, ఆపై వారితో శృంగారం జరిపి హత్యలు చేయడం కాకేహి దినచర్య.
ఈ వ్యవహారం బయటకు పొక్కిన తరువాత జపాన్ లో కలకలం రేగింది. డేటింగ్ ఏజన్సీలు, ఇతర వెబ్ సైట్ల ద్వారా తనకన్నా పెద్దవాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు లేని ఒంటరి వాళ్లను ఎంచుకుని, వారితో పరిచయం పెంచుకుని, జీవిత బీమా పాలసీలు చేయించి, నామినీగా తన పేరును రాయించుకుని, ఆపై వారిని హతమార్చేది.
హత్యలు చేసేందుకు పదేళ్ల వ్యవధిలో బిలియన్ యన్ లు వెచ్చించి సైనైడ్ ను కూడా కొనుగోలు చేసింది. తొలుత కోర్టులో నేరాన్ని అంగీకరించని కాకేహి, చివరికి తప్పును ఒప్పుకుని తన నాలుగో భర్తను హత్య చేసిన విషయంతో ప్రారంభించి, మొత్తం తాను చేసిన హత్యలను ఒప్పుకుంది.