Kamal Haasan: కమలహాసన్ పుట్టిన రోజు నేడు.. సంబరాలకు దూరం.. యాప్ విడుదల

  • నిరాడంబరంగా కమలహాసన్ పుట్టినరోజు 
  • చెన్నైకి 20కిలో మీటర్ల దూరంలోని వైద్యశిబిరం సందర్శన
  • వరద బాధితులకు సాయమందించాలని అభిమానులకు పిలుపు

నేడు విలక్షణ నటుడు కమలహాసన్ పుట్టినరోజు. ప్రతిఏటా ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది రాజకీయ పార్టీ పెట్టనున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయని, ఈ వేడుకల్లోనే ఆయన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కమలహాసన్ పుట్టినరోజు వేడుకలను రద్దుచేశారు.

 జన్మదినాన్ని చెన్నైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్య శిబిరాన్ని సందర్శించడం ద్వారా జరుపుకోనున్నారు. అనంతరం చెన్నైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ తన పేరిట మొబైల్‌ యాప్‌ సేవలు ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారానే తన రాజకీయ ప్రణాళికలు కార్యకర్తలకు వివరించనున్నారు. అలాగే ప్రజా సమస్యలు, కష్టాలు ఈ యాప్ ద్వారా ఆయన విననున్నారు. తన పుట్టినరోజు వేడుకలకు బదులుగా ఏదన్నా సేవచేయాలని, అలా చేయడం ద్వారా మనం కోరుకున్న మార్పు వస్తుందని కమలహాసన్ అభిమానులకు పిలుపునిచ్చారు. 

Kamal Haasan
birthday
celebrations
  • Loading...

More Telugu News