yanamala ramakrishnudu: 714 మంది ఉంటే... జగన్ రూటే సపరేటు!: 'ప్యారడైజ్ పేపర్ల'పై యనమల

  • మిగతావారంతా ఆస్తిపాస్తుల కోసం ఏళ్లు కష్టపడ్డారు
  • జగన్ ఏడాదిలోనే వేల కోట్లు సంపాదించారు
  • అతి తక్కువ కాలంలోనే భారీ ఆస్తులు
  • గుట్టు మరోసారి రట్టయిందన్న యనమల

ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న 'ప్యారడైజ్ పేపర్స్'లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పేరు ఉండటంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ జాబితాలో ఇండియాకు చెందిన 714 మంది పేర్లు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, వారందరిలోకీ జగన్ ఓ ప్రత్యేకమైన వ్యక్తని అన్నారు.

మిగతావారంతా దశాబ్దాలపాటు కష్టపడి ఆస్తులను సంపాదించుకుని, ఆ డబ్బుపై పన్ను కట్టకుండా విదేశాల్లో దాచుకుని తప్పు చేశారని, జగన్ మాత్రం ఏడాదిలో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో ఇంత భారీగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ప్యారడైజ్ పేపర్లలో జగన్ అవినీతి గుట్టు మరోసారి బట్టబయలైందని యనమల వ్యాఖ్యానించారు.

yanamala ramakrishnudu
ys jagan
paradize papers
  • Loading...

More Telugu News