qatar airways: విమానంలో జుట్టూ జుట్టూ పట్టుకున్న భార్యాభర్తలు.. విమానం నుంచి దించివేత!

  • నిద్రపోతున్న భర్త వేలిముద్రలతో అతని ఫోన్ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించిన భార్య
  • మెలకువ వచ్చి భార్యను నిలదీసిన భర్త
  • మాటామాటా పెరిగి వాగ్వాదం

విమానంలో భార్యాభర్తల వివాదం వారిని విమానం నుంచి కిందికి దించేసేవరకు తెచ్చిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఇరాన్ కు చెందిన భార్యాభర్తలు చెన్నై నుంచి విమానంలో బాలీఖతార్ వెళ్తున్నారు. అప్పటికే భర్త తనను మోసగిస్తున్నాడన్న అనుమానంతో వున్న భార్య, అతడి ఫోన్‌ సమాచారం తెలుసుకోవాలని భావించింది. దీంతో నిద్రపోతున్న భర్త వేలిముద్రల సాయంతో అతని స్మార్ట్‌ ఫోన్‌ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఊహించని విధంగా అతనికి మెలకువ వచ్చేసింది.

 దీంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా అతనికి దీటుగా సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకునేవరకు వెళ్లారు. దీంతో విమాన సిబ్బంది వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారిపై కూడా దంపతులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు విమానాన్ని చెన్నైకి మళ్లించి, అక్కడ వారిద్దరినీ కిందికి దించేసి వెళ్లిపోయారు. అనంతరం దంపతులిద్దరూ ఒక అవగాహనకు రావడంతో మరో విమానంలో వారిని అధికారులు పంపారు.

qatar airways
couple
Altercation
Controversy
  • Loading...

More Telugu News