rahul gandhi: పవిత్ర గ్రంథమైన 'భగవద్గీత'కు మోదీ సొంత భాష్యం చెబుతున్నారు: రాహుల్ గాంధీ
- పని చేయండి, ప్రతిఫలాన్ని ఏమీ ఆశించవద్దని గీత చెబుతోంది
- భారతీయ జనతా పార్టీ కష్టపడకుండానే ప్రతిఫలం ఆశించే రకం
- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని మోదీ అన్నారు
ఇతరుల కష్టాన్ని తాము తినాలన్నదే ప్రధానమంత్రి మోదీ అభిమతమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... పని చేయండి, ప్రతిఫలాన్ని ఏమీ ఆశించవద్దని గీత చెబుతోందని, అయితే మోదీ మాత్రం పని చేయకపోయినా ఫర్వాలేదు, ఇతరుల కష్టాన్ని మనం తిందాం అన్నట్లు కొత్త భాష్యం చెబుతున్నారని చురకలంటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ఇటీవల మోదీ వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ కష్టపడకుండానే ప్రతిఫలం ఆశించే రకమని ఎద్దేవా చేశారు.