kancharla bhupal reddy: టీఆర్ఎస్‌లో చేరిన కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, అనుచరులు!

  • నల్గొండ జిల్లా టీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి
  • ఈటల రాజేంద‌ర్, ఎంపీ బూర న‌ర్స‌య్య‌ స‌మ‌క్షంలో చేరిక ‌
  • టీఆర్ఎస్‌లోకి కంచ‌ర్ల కృష్ణారెడ్డి, ప‌లువురు ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు కూడా

నల్గొండ జిల్లా టీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో రాష్ట్ర మంత్రి ఈటల రాజేంద‌ర్, ఎంపీ బూర న‌ర్స‌య్య‌ స‌మ‌క్షంలో భూపాల్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు కంచ‌ర్ల కృష్ణారెడ్డి, ప‌లువురు ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు, న‌ల్గొండ టీడీపీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. కొడంగ‌ల్ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారిన అనంతరం తాను కూడా పార్టీ మారతాన‌ని భూపాల్ రెడ్డి తెలిపారు. ఆయ‌న కాంగ్రెస్‌లో చేర‌తార‌ని కొంద‌రు భావించారు. చివ‌రకు ఈ రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

kancharla bhupal reddy
TRS
Telugudesam
  • Loading...

More Telugu News