sairat: 'సైరాట్‌' రీమేక్ ద్వారా బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్న శ్రీదేవి కూతురు జాహ్నవి

  • హీరోగా షాహిద్ క‌పూర్‌ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్‌
  • సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన మ‌రాఠి చిత్రం
  • రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన మొద‌టి మ‌రాఠి చిత్రం 'సైరాట్‌'

మ‌రాఠి సినీ ప‌రిశ్ర‌మ‌ను మ‌లుపు తిప్పిన 'సైరాట్‌' చిత్ర రీమేక్ ద్వారా న‌టి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టించ‌నున్నాడు. 'బ‌ద్రినాథ్ కీ దుల్హానియా' చిత్ర ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అలాగే నిర్మాణ బాధ్య‌త‌లు క‌ర‌ణ్ జొహార్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రాఠిలో రింకు రాజ్‌గురు, ఆకాశ్ థోస‌ర్‌లు న‌టించిన 'సైరాట్‌' చిత్రం రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన మొద‌టి మ‌రాఠి చిత్రంగా నిలిచింది. బిజినెస్‌, క‌లెక్ష‌న్లు, న‌ట‌న‌, అవార్డుల ప‌రంగా కూడా ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందుకొని మ‌రాఠి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

sairat
marathi
sridevi
bonie kapoor
jhanvi
shahid
ishan khattar
badrinath ki dulhania
shashank khaitan
karan johar
  • Loading...

More Telugu News