Kamal Haasan: కమలహాసన్ పై విమర్శలు గుప్పించిన రాజ్ నాథ్ సింగ్!

  • కమల్ వ్యాఖ్యలు అర్థరహితం
  • ఓట్ల కోసమే ఈ వ్యాఖ్యలు
  • ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేము సహించం

హిందూ ఉగ్రవాదంపై ప్రముఖ సినీనటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. కమల్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. కేవలం ఓట్ల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించమని అన్నారు. హిందువుల్లో ఉగ్రవాదం పెరుగుతోందన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం కమల్ కు సరికాదని అన్నారు. బాలీవుడ్ సినిమా 'పద్మావతి'పై కూడా ఆయన స్పందించారు. చరిత్రను వక్రీకరించారనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రదర్శనను నిలిపేయాల్సి వస్తుందని అన్నారు.

Kamal Haasan
rajnath singh
  • Loading...

More Telugu News