kodali nani: పెద్ద పులిని చూసి ఓ నక్క 'దొంగ పాదయాత్రలు' చేసింది: చంద్రబాబుపై కొడాలి నాని విసుర్లు

  • చంద్రబాబుపై విమర్శలు
  • పగలు బస్సులో పడుకుని, రాత్రిపూట దొంగ యాత్రలు చేశారు
  • పాదయాత్ర అంటే గుర్తొచ్చేది వైయస్సే

మన రాష్ట్రంలో పాదయాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2003లో అప్పటికే తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతున్న ఓ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వైయస్సార్ పాదయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను, కష్టసుఖాలను తెలుసుకొని వైయస్ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. రైతు సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఉచిత కరెంట్ ను ఇచ్చారని, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారని, ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు.

పెద్ద పులిలాంటి వైయస్ ను చూసి... ఈ రాష్ట్రంలో ఓ నక్క దొంగ యాత్రలు చేసిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పగలంతా బస్సులో పడుకుని, రాత్రిపూట దొంగ పాదయాత్రలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే జగన్ పాదయాత్ర చేపడుతున్నారని... ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలన్నింటినీ జగన్ పరిష్కరిస్తారని చెప్పారు. ఇడుపులపాయ సభలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

kodali nani
ysrcp
gudivada mla
chandrababu
ap cm
jagan padayatra
  • Loading...

More Telugu News