america: ఉత్తరకొరియాతో యుద్ధానికి మొగ్గు చూపుతున్న మెజారిటీ అమెరికన్లు!
- 84 శాతం మంది అమెరికన్లు ఉత్తరకొరియాతో యుద్ధం కోరుకుంటున్నారు
- ట్రంప్ వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయానికి రావాలి
- దక్షిణకొరియా-అమెరికాల దళాలతో ఉత్తరకొరియా తలపడలేదు
ఉత్తరకొరియాపై యుద్ధం చేయాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారని ఆర్మీ జనరల్ విన్సెంట్ బ్రూక్స్ తెలిపారు. పదవీ విరమణ చేసిన దక్షిణకొరియా సైనికులకు వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరకొరియాతో యుద్ధానికి దిగితే అమెరికా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. 84 శాతం మంది అమెరికన్లు ఉత్తరకొరియాతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ట్రంప్ వీలైనంత త్వరగా దీనిపై ఒక నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు. ఉత్తరకొరియాకు సమాధానం చెప్పడం చాలా ముఖ్యమని రిపబ్లికన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దక్షిణకొరియా-అమెరికా దళాలను ఎదుర్కొనేంత దమ్ము ఉత్తరకొరియాకు లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.