norway: సముద్రం లోపల విందు.. యూరోప్ లో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-7bb9bb3286489c44cc6ac3d4d802b214c536fd2e.jpg)
- నార్వేలో అండర్ వాటర్ రెస్టారెంట్
- 2018లో ప్రారంభం
- ఆసక్తికరంగా నిర్మించిన డిజైనర్లు
పైన కనిపిస్తున్న ఫొటోలో ఒక భారీ రాయి సముద్రంలో మునిగిపోతున్నట్లుంది కదూ? కానీ అది రాయి కాదు, యూరోప్ లోనే తొలి అండర్ వాటర్ రెస్టారెంట్. దీనిని బయట నుంచి చూసినా, లేక ఆకాశం నుంచి చూసినా ఒక పెద్ద రాయి సముద్రంలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అదే లోపలికి వెళ్లి చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోవాల్సిందే. అంత అధునాతనంగా .. అందంగా వుంటుంది.
దీనిని దక్షిణ నార్వేలో ఏర్పాటు చేశారు. పనోరామిక్ విండోతో దీనిని నిర్మించారు. దీని పొడవు 36 అడుగులు. ఇందులో వంద మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఇందులో అడుగు పెట్టగానే సబ్ మెరైన్ లో అడుగుపెట్టినట్టు ఉంటుంది. భారీ అలలు ఎగసిపడినప్పుడు దీనికి ఎలాంటి నష్టం వాటిల్ల కుండా కాంక్రీట్ తో గోడలు నిర్మించారు. ఇది చూసేందుకు షిప్పింగ్ కంటైనర్ లా కనిపిస్తుంది. దీనిని 2018లో ప్రారంభించనున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-ecc3edab55f7875974dc50545026847311d48168.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-efe99ad1d4e271ecb1aeb66ef025563b69df8d4b.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-2933419b6828ab48ae6f222441d5e2d2a98f1070.jpg)