jagan: పాదయాత్ర చేయడానికి కారణమిదే: జగన్

  • చంద్రబాబు అరాచకపాలన కొనసాగుతోంది
  • నాలుగేళ్లలో ఆయన చేసిందేమీ లేదు
  • ప్రజల్లో భరోసా కలిగించేందుకే పాదయాత్ర

రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు పాలన వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా, ఆయన పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబమైనా సంతోషంగా ఉందా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పనిని కూడా చంద్రబాబు చేయలేక పోయారని అన్నారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అందరూ మోసపోయారని విమర్శించారు.

చంద్రబాబులాంటి మోసగాడు దేశంలోనే లేరనే మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోందని అన్నారు. బాబు పాలనలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పాలన నుంచి బయటపడేస్తామనే భరోసాను ప్రజలకు ఇవ్వడానికే ఈ పాదయాత్రను మొదలు పెట్టామని తెలిపారు. ఇడుపులపాయలో జగన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

jagan
jagan padayatra
Chandrababu
  • Loading...

More Telugu News