ys jagan: వైయస్సార్ కు మరణం లేదు.. చంద్రబాబు రాజకీయంగా నన్ను తప్పించే ప్రయత్నం చేశారు: జగన్

  • ప్రతి గుండెలో వైయస్సార్ ఉన్నారు
  • చంద్రబాబు వ్యవహారశైలి నాకు చాలా బాధను కలిగించింది
  • మీరు ఇచ్చిన భరోసానే నాకు ఊరటనిస్తోంది

దివంగత నేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని... ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు నేతలు చేయని ప్రయత్నాలు లేవని మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని... కుమారుడి వయసున్న తనను రాజకీయంగా తప్పించేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని... వీటిని చూసినప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని చెప్పారు.

నాన్నగారు చనిపోతూ తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి పోయారని... మిమ్మల్ని చూస్తున్నప్పుడు తనకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ పెద్దలతో పోరాటం చేస్తున్నానని... అయినా, తాను వేసిన ప్రతి అడుగు వెనకా మీరు ఇచ్చిన భరోసా ఉందని... మనందరినీ చూసి ఇప్పుడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఉందని చెప్పారు. ఇడుపులపాయలోని సభాప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ys jagan
jagan
jagan padayatra
  • Loading...

More Telugu News