YSRCP: రాజన్న రక్తం వస్తోందని తొడగొట్టి చెప్పండి: రోజా

  • చంద్రబాబు కుర్చీ దిగేవరకు జగన్ పాదయాత్ర ఆగదు
  • పాదయాత్రతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది
  • ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వెంటనే టీడీపీ మంత్రులు, నేతలకు దిమ్మతిరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు కుర్చీ కదిలేవరకు, తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించేంత వరకు జగన్ పాదయాత్ర ఆగదని ఆమె అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు యువత ముగింపు పలకాలని.... రాజన్న రక్తం వస్తోందంటూ తొడగొట్టి చెప్పాలని పిలుపునిచ్చారు.

జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సభలో రోజా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను, విద్యార్థులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబును గద్దె దింపేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. వైయస్ కుటుంబం మాట తప్పదు, మడమ తిప్పదు అనే విషయం ఇప్పటికే పలు అంశాల్లో రుజువైందని చెప్పారు. పాదయాత్ర వేస్ట్ అంటున్నవారికి... రాష్ట్రంలోని సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు తలెత్తుకు తిరిగారని అన్నారు. 

YSRCP
roja
ysrcp mla
jagan
jagan padayatra
  • Loading...

More Telugu News