ys jagan: పాదయాత్ర తొలి రోజే జగన్ కు షాక్.. అంతర్జాతీయ నల్లధన ప్రముఖుల జాబితాలో జగన్ పేరు

  • విదేశాలకు నల్లధనాన్ని తరలించిన జాబితాలో జగన్ పేరు
  • జాబితాను బయటపెట్టిన ఐసీఐజే
  • జాబితాలో ఉన్నవారిలో పలువురు ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు

వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ రోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన పేరు అంతర్జాతీయ నల్లధన కుబేరుల జాబితాలో నిలిచింది. ఆయనతో పాటు మన దేశంలోని పలువురు పెద్దల పేర్లను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తన 'ప్యారడైజ్ పేపర్స్' ద్వారా బయటపెట్టింది. ప్యారడైజ్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్టు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. 'యాంటీ బ్లాక్ మనీ డే'ను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో, ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

బెర్ముడాస్ అప్లీబీ, సింగపూర్స్ ఆసియాసిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 19 నల్లధన స్వర్గధామాల్లో తమ నల్లధనాన్ని దాచుకునేందుకు ప్రపంచ కుబేరులు, శక్తిమంతులకు సహకారం అందిస్తున్నాయి. వీటి సహాయంతో వీరంతా తమ నల్లధనాన్ని విదేశీ సంస్థల్లోకి తరలిస్తున్నారు. ప్యారడైజ్ పేపర్స్ దాదాపు 13.4 మిలియన్ డాక్యుమెంట్లను బయటపెట్టింది. వీటిలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చే అంశమే. ఈ అంశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకోబోతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు టీడీపీ నేతలు ఈ అంశంపై మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు, ప్యారడైజ్ పేపర్లలో ఉన్న భారతీయ ప్రముఖుల్లో పలువురు ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు.

ys jagan
jagan
ysrcp
paracise papers
  • Loading...

More Telugu News