Tamannaah: శివసేన నేత దగ్గర హిందీ నేర్చుకుంటున్న తమన్నా!

  • హిందీ నేర్చుకుంటున్న సినీ నటి తమన్నా
  • బాలీవుడ్ లో పాగా వేసేందుకు హిందీపై దృష్టి 
  • హిందీ నేర్పుతున్న వినయ్ శుక్లా 

నటనకు భాషా భేదాలు ఉండవని పలువురు ప్రముఖ నటీనటులు చెబుతుండడాన్ని వినే ఉంటారు. అందుకే, పలు భాషా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని పలువురు నటీనటులు ప్రయత్నిస్తుంటారు. బాలీవుడ్ లో సరైన హిట్లు లేని తమన్నా ఇప్పుడు హిందీ చిత్రసీమలో తన పేరు నిలుపుకోవాలని భావిస్తోంది. దీంతో మరింత బాగా హిందీ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది.

దీంతో హిందీని సులభంగా నేర్పించే మహారాష్ట్ర శివసేన నేత, ఐసీఎస్సీ, సీబీఎస్సీ విద్యార్థులకి హిందీ పాఠాలు సులభంగా బోధించే వినయ్ శుక్లా దగ్గర ట్యూషన్ కు చేరింది. అధ్యాపకుడైన వినయ్ శుక్లా దగ్గర పలువురు బాలీవుడ్ నటీనటులు హిందీ నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా కూడా ఆయన వద్దే హిందీ నేర్చుకుంటోంది. 

Tamannaah
vinay shukla
maharashtra
shiva sena
  • Loading...

More Telugu News