Donald Trump: ట్రంప్ పర్యటన సందర్భంగా ఉత్తరకొరియా అణుదాడి చేయవచ్చు: అమెరికా నిపుణుడు

  • ఆసియా పర్యటనకు వచ్చిన ట్రంప్
  • జపాన్ లో పర్యటన
  • టూర్ లో ఉండగా అణుదాడి జరిగే అవకాశం ఉందంటూ వైట్ హౌస్ అధికారి హెచ్చరిక
  • అణుపరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్న సైంటిస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చిన సందర్భంగా అణుదాడి జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ లో ఆసియా-పసిఫిక్ సెక్యూరిటీ ప్రొగ్రామ్ డైరెక్టర్ పాట్రిక్ క్రొనిన్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియా దేశాలు పర్యటిస్తున్న సమయంలో ఉత్తరకొరియా అణుబాంబును ప్రయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దీంతో ఉత్తరకొరియా చర్యలపై నిఘా పెంచినట్టు ఆయన తెలిపారు. ఉత్తరకొరియా చేయబోయే దాడికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో సీనియర్ అధికారి, ఫెడరేషన్ ఆఫ్ అమెరికా శాస్త్రవేత్త ఆడం మౌంట్ మరోలా మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియాలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా మరో అణుపరీక్షను మాత్రం నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News